నాలుగు రోజుల పాటు వర్షాలు

25 Apr, 2020 13:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/తిరుపతి : ఈశాన్య విదర్భ, పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు, కొమరిన్‌ ప్రాంతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.

కాగా అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. మరో వైపు నేడు, రేపు  రాయలసీమలోని పలు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

 

మరిన్ని వార్తలు