అప్రమత్తమైన కృష్ణా జిల్లా యంత్రాంగం

22 Oct, 2019 22:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత మండలాల అధికారులతో  కలెక్టర్‌ ఇంతియాజ్ మంగళవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తీర ప్రాంతంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనుండటంతో చేపల వేట నిషేధించారు. సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. తుపాను ప్రభావిత బాధితులను అవసరమైతే పునరావాసాలకు తరలించేందుకు షెల్టర్లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

కంట్రోల్ రూమ్ నంబర్లు..
మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయం-O8672-252752

బందరు ఆర్డీఓ కార్యాలయం- 08672-252486

విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866-2574454

>
మరిన్ని వార్తలు