ఈ జిల్లాలో మరో 3 రోజుల పాటు వర్ష సూచన

13 Jul, 2020 19:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసిమ జిల్లాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉంది. అంతేగాక భారీ నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(మంగళవారం) మూడు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. బుధవారం రోజున మూడు జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు