రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

11 Sep, 2013 10:20 IST|Sakshi

రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది.  దక్షిణ కోస్తా అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉందని తెలిపింది.

 

అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదగా అల్ప పీడన ద్రోణి చురుగ్గా కదులుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు