భారీ వర్షాలు; అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

24 Oct, 2019 13:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌. ఫైర్‌ బృందాలను విపత్తులశాఖ కమిషనర్‌ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు, నది పరీవాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నది దాటి వెళ్లడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం లాంటివి చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్ని జలకళను సంతరించికున్నాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద విపత్తుల నిర్వహణశాఖ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఇక సుంకేశుల వద్ద  ఇన్ ఫ్లో 1,87,077 అవుట్ ఫ్లో 1,86,973 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 6,61,157 అవుట్ ఫ్లో 6,13,089 క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,06,470 క్యూసెక్కులు ఉంది. పులిచింతల  వద్ద ఇన్ ఫ్లో 4,88,987, అవుట్ ఫ్లో 4,95,054 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఇన్ ఫ్లో 4,60,000, అవుట్ ఫ్లో 4,17,000 క్యూసెక్కలు ఉంది. 

మరిన్ని వార్తలు