26న అల్పపీడనం

22 Apr, 2019 09:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/నెట్‌వర్క్‌: దక్షిణ మరట్వాడా నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోపక్క ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక వరకు విదర్భ, మరట్వాడా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఈనెల 26న శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం రాత్రి వెల్లడించింది. ఇది 24 గంటల తర్వాత బలపడి వాయుగుండంగా మారవచ్చని తెలిపింది. మరోవైపు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. కోస్తాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని వివరించింది. 

సాధారణ ఉష్ణోగ్రతలే..
ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయి. కొన్ని రోజులుగా సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా, ఆదివారం అనేక చోట్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు, అనంతపురంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 11 సెం.మీల భారీ వర్షం కురిసింది. శృంగవరపుకోటలో 6, మెరకముడిదాంలో 5, బొబ్బిలి, సీతానగరం, పొదిలిల్లో 4, రాచెర్ల, కోడూరు, రోళ్ల, బద్వేలుల్లో 3, విశాఖపట్నం, ఉదయగిరి, సాలూరు, పాకాలల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అరటి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మాతుమూరు, కర్రివలస, పద్మాపురం, కేసలి, గురివినాయుడుపేట తదితర ప్రాంతాల్లో మామిడిపంట దెబ్బతింది. కొత్తూరులో పిడుగు పడి ఒకరు మృతి చెందారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

23 తర్వాత వీళ్లని ఎక్కడ దాచాలి?

కౌంటింగ్‌లో ఫారం –17సీ ...ఇదే కీలకం

‘ముందు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి’

ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌

టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి..అదేలా?

నాటుసారాతో పట్టుబడ్డ టీడీపీ నేత

బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న లారీ దగ్ధం

నోటీసులపై  న్యాయ పోరాటం

వైఎస్సార్‌సీపీలో జోష్‌

‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

కరెంట్‌ బిల్లులు ఎగ్గొట్టిన టీడీపీ నేతలు

ఏపీ లాసెట్‌ ఫలితాల విడుదల

క్షణమొక యుగం  

అర్ధరాత్రి తరువాతే తుది ఫలితం

శిథిల గదులు – సిబ్బంది వ్యథలు

‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

ఎన్నికల బరిలో వైఎస్సార్‌ టీయూసీ

‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’

అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

కరాటేలో బంగారు పతకం

స్వేచ్ఛగా ఓటెత్తారు!

సైకిల్‌ డీలా... ఫ్యాన్‌ గిరా గిరా!

దళితులకు ఓటు హక్కు కల్పించాలన్నదే నాలక్ష్యం

ఎగ్జిట్‌ పోల్సే.. ఎగ్జాట్‌ పోల్స్‌ కాదు

ఇసుక నుంచి తైలం తీస్తున్న తెలుగు తమ్ముళ్లు

వద్దంటే వినరే..!

పేట్రేగుతున్న మట్టి మాఫియా

పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలి

చెట్టుకు నీడ కరువవుతోంది..!

వీడిన హత్య కేసు మిస్టరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వరల్డ్‌ స్టార్‌ నుంచి ఊహించని ఆహ్వానం’

మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`

చంద్రబోస్‌ నివాసంలో విషాదం

అభిమానులకు ప్రభాస్‌ సర్‌ప్రైజ్!

‘కారణం లేకుండానే నిర్మాతలు నన్ను తొలగించేవారు’

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ