ఉధృతంగా ప్రవహిస్తున్న కందూ నది

19 Sep, 2019 10:46 IST|Sakshi

నంద్యాల-నందికొట్కూరు మధ్య నిలిచిన రాకపోకలు

మరో మూడు రోజులు భారీ వర్షాలు..

సాక్షి, కర్నూలు: మిడుతూరు మండలం తలముడిపి వంతెనపై కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నంద్యాల-నందికొట్కూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నంద్యాల డివిజన్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మద్దూరు వంతెనపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నీట మునిగిన కాలనీల్లో గురువారం  నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి పర్యటించారు.

మూడు రోజులు భారీ వర్షాలు..
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 19 నుండి 21వ తేదీ వరకు రాష్ట్ర మంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని... నేడు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో పిడుగులతో కూడిన  భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని తెలిపింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తాయని..ప్రజలు జాగ్రత్తలుపాటించాలని వాతావరణ నిపుణులు తెలిపారు.

మరిన్ని వార్తలు