కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

27 Aug, 2014 17:05 IST|Sakshi

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశముంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతానికి ఆనుకుని  ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య అల్పపీడనం ఏర్పడింది. కోస్తాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు