పల్నాడులో కుండపోత

26 Oct, 2014 14:23 IST|Sakshi
పల్నాడులో కుండపోత

గుంటూరు:  అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి.

భారీ వర్షాలకు మాచర్ల పట్టణంలో పల్లపు ప్రాంతాలు నీట ముగినిగాయి. 15, 16 వార్డుల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చంద్రవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.  పంటపొలాలు నీట ముగిగాయి.

పులిచింతల ప్రాజెక్ట్ లో నీటిమట్టం పెరగటంతో కోళ్లూరు గ్రామం పూర్తిగా జలమయం అయ్యింది. ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  పల్నాడులో 29 సెంటీమీటర్ల వర్షం పడింది.

మరిన్ని వార్తలు