రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు

7 Sep, 2014 09:28 IST|Sakshi

హైదరాబాద్: రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పశ్చిమబెంగాల్ తీరాన్ని అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని తెలిపింది. ఇది ఈ రోజు సాయంత్రంలోగా బలపడి వాయుగుండంగా మారే అవకాశలున్నాయని పేర్కొంది.

అల్పపీడనంతోపాటు ఉపరితల అవర్తనం కదులుతుందని...ఇది ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణిగా మారి వేగంగా కదులుతుందని వెల్లడించింది. దాంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్లు వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తుపాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.

మరిన్ని వార్తలు