నెల్లూరులో భారీ వర్షం - ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

11 Nov, 2015 11:10 IST|Sakshi

వాయు గుండం ప్రభావంతో జిల్లాలో మూడో రోజు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాటికి జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  గూడూరు వద్ద నీటిలో కొట్టుకు పోతున్న ఒక వ్యక్తిని స్థానికులు కాపాడారు.

మరో వైపు  భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండాపురం మండలం గండి కట్ట చెరువుకు గండి పడింది. పొదలకూరు మండలం భోగాపురం చెరువుకు గండి పడటంతో.. హరిజన వాడకు వరద ముప్పు పొంచి ఉంది. సైదాపురం సమీపంలో కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాక పోకలు నిలిచి పోయాయి. ఆత్మకూరులో బొగ్గేరు, కేతమన్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గూడురు వద్ద పంబలేరు నీటి ప్రవాహం పెరిగింది.

భారీ వర్షాల కారణంగా నెల్లూరు - చెన్నై మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మనుబోలు వద్ద వరద నీరు పొంగి.. రహదారిపైకి చేరింది. రైల్వే ట్రాక్ పైకి వరద నీరు రావడంతో.. ట్రాక్ కుంగి పోయింది.

మరిన్ని వార్తలు