రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు

31 Aug, 2014 09:31 IST|Sakshi

విశాఖపట్నం: ఉత్తరకోస్తా, విదర్భ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. అల్పపీడన పరిసర ప్రాంతాలలో ఉపరితల అవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హచ్చరించింది.

మరిన్ని వార్తలు