ఏజెన్సీలో భారీ వర్షం

3 Jun, 2019 11:56 IST|Sakshi
అనంతగిరిలో భారీ వర్షం కురుస్తున్న దృశ్యం

విశాఖపట్నం ,అనంతగిరి (అరకులోయ): మండల కేంద్రంలో అనంతగిరిలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురువడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు వేసవితాపంలో ఉదయం అంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నా రు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. భారీ వర్షాలతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గత ఏడాది వర్షాలు లేకపోవడం గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊట ఎండిపోయి, బోరు నుంచి నీరు రాకపోవడం ప్రజలు పడుతున్నా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 

డుంబ్రిగుడ: డుంబ్రిగుడ, అరకు,అరకులోయ ప్రాంతాల్లో  ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గెడ్డలు ఉపొంగి ప్రవహించాయి. కాలువల్లో నీరు చేరింది.
డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ చిలిగుడ్రి గ్రామానికి చెందిన వంతల అర్జున్‌ అనే గిరిజనుడి ఇల్లు ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షనికి గాలి వానకు ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయి నష్టం జరిగిందని బాదిత గిరిజనుడు ఆవేదన వ్యక్తం చేశాడు.   గిరిజనులు ఉపయోగిస్తున్న తిండి గింజలు కూడా పూర్తిగా నష్టం జరిగినట్లు ఆయన చెప్పారు. సుమారు రూ.70 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. 

మరిన్ని వార్తలు