భారీగా ఇసుక నిల్వలు సీజ్

16 Dec, 2015 18:19 IST|Sakshi

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. చింతలపూడి మండలం నాగారెడ్డిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన సుమారు 150 ట్రాక్టర్ల ఇసుకను బుధవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ప్రత్యేక అధికారి ఆసిఫా బేగం, తహశీల్దార్ మైఖేల్ రాజు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు