భారీగా బదిలీలు

4 Nov, 2013 00:43 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీలను భర్తీచేసే క్రమంలో డిప్యూటీ తహశీల్దార్లకు అడహక్ బేసిస్‌లో తహశీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 మండలాల్లో తహశీల్దార్ల మార్పు చోటు చేసుకుంది. వివరాల్లోకొస్తే.. ముప్పాళ్ల తహశీల్దార్  ఎంఎల్ సంజీవకుమారిని సత్తెనపల్లికి పంపి అక్కడ ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ ఎంటీ వెంకటేశ్వర్లును తాడికొండ తహ శీల్దార్‌గా బదిలీ చేశారు. తెనాలి డివిజన్ కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌సీ) తహశీల్దార్ షేక్ ఇస్మాయిల్‌ను కాకుమాను తహశీల్దార్‌గా పంపారు. దుర్గి తహశీల్దార్ వి.రఘురాంకు గురజాల తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చి, అక్కడి తహశీల్దార్ ఎ.సరళవతిని మాతృశాఖకు పంపారు.
 
 మాచవరం తహశీల్దార్ జి.లెవీ దుర్గికి బదిలీ అయ్యారు. మాచర్ల తహశీల్దార్ టి.ప్రవీణ్‌కుమార్‌ను మాచవరానికి, అమరావతి తహశీల్దార్ కె.సుజాతను నాదెండ్లకు బదిలీ చేశారు. గుంటూరు డివిజన్ కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ తహశీల్దార్ డి.మల్లికార్జునరావుకు అడహక్ బేసిస్ కింద అమరావతి తహశీల్దార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. గతంలో బెల్లంకొండ తహశీల్దార్‌గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన జి.శ్రీనివాసును వెల్దుర్తి తహశీల్దార్‌గా నియమించారు. కలెక్టర్ కార్యాలయ బి-సెక్షన్ సూపరింటెండెంట్, నరసరావుపేట డివిజన్ కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ తహశీల్దార్ కె. వెంకటేశ్వర్లును ముప్పాళ్ల మండలానికి అడహక్ తహశీల్దార్‌గా పంపారు. తెనాలి డివిజన్ కేఆర్‌సీ డిప్యూటీ తహశీల్దార్ ఎ.శేషుకుమార్‌కు అదే డివిజన్ కేఆర్‌సీ తహశీల్దార్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు.
 
 లాంగ్‌లీవ్‌లో ఉన్న టి.వల్లయ్యను గురజాల రెవెన్యూ డివిజన్ కేఆర్‌సీ అడహక్ తహశీల్దార్‌గా నియమించారు. పొన్నూరు తహ శీల్దార్ డీవీఎల్‌ఎన్ శేషగిరిరావుకు గురజాల ఆర్డీవో కార్యాలయ డీఏవోగా పోస్టింగ్ ఇచ్చారు. సెలవులో ఉన్న బాపట్ల డిప్యూటీ తహశీల్దార్ వి.బాబూరావును గుంటూరు డివిజన్ కేఆర్‌సీ అడహక్ తహశీల్దార్‌గా పంపారు. కలెక్టర్ కార్యాలయ ల్యాండ్‌రిఫార్మ్స్ ప్రత్యేక తహశీల్దార్ టి.సుబ్రమణ్యశాస్త్రిని అక్కడే ఈ-సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. గతంలో యడ్లపాడు తహశీల్దార్‌గా పనిచేసి సస్పెన్షన్‌కు గురైన డి.వి. సుబ్బారావుకు కలెక్టర్ కార్యాలయ హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

నాదెండ్ల తహశీల్దార్ సీహెచ్ సుధారాణిని యడ్లపాడు తహశీల్దార్‌గా పంపారు. కలెక్టర్ కార్యాలయం హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్ బీబీఎస్ ప్రసాద్‌ను కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి(ఏవో)గా నియమించారు. యడ్లపాడు తహశీల్దార్ ఎస్.వి.శ్రీనివాసులును కలెక్టరేట్ కార్యాలయ ల్యాండ్‌రిఫార్మ్స్ విభాగ ప్రత్యేక తహశీల్దార్‌గా నియమించారు. చిలక లూరిపేట సీఎస్‌డీటీ ఎం.వి.కె.సుధాకర్‌రావును మాచర్ల మండలానికి అడహక్ తహశీల్దార్‌గా పంపుతూ ఉత్తర్వులిచ్చారు.

>
మరిన్ని వార్తలు