జల దిగ్బంధంలో లంక గ్రామాలు

9 Sep, 2019 15:29 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : గోదావరి నది పరివాహక ప్రాంతాలకు వరదముప్పు ఇంకా తొలగలేదు. దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 12 గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో నిర్వాసితులు తలదాచుకున్నారు. శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విలీన మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాపికొండలలో టూరిజం బోట్లు నిలిచిపోయాయి. సాగు చేసిన భూములు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ముంపునకు గురైన లోతట్టు గిరిజన గ్రామాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, నిత్యావసర వస్తువులను అధికారులు సరఫరా చేస్తున్నారు. బాధితులను బోర్నగూడెం పునరావాస కేంద్రానికి రావాలని అధికారులు కోరుతున్నా గ్రామస్తులు తిరస్కరిస్తున్నారు. అధికారులు ఇంతవరకూ గ్రామాల్లో పర్యటించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వరద తీవ్రత పెరుగుతుండటంతో లంకగ్రామాల్లో నాటు పడవ ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు. గోదావరి ఏటి గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి రక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపదికతన ఏర్పాటు చేస్తున్నారు. అల్లవరం మండలం పల్లిపాలెం గ్రామంలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన ఆర్డీవో వెంకటరమణ బాధితులను పరామర్శించారు. ఇది చదవండి : పెరుగుతున్న గోదా‘వడి’

మరిన్ని వార్తలు