ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

23 Oct, 2019 20:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటేత్తుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో.. గంట గంటకూ బ్యారేజ్‌లోకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌లోరి చేరింది. దీంతో అధికారులు 70 గేట్లను ఎత్తి.. లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజ్‌లోకి వరద ప్రవాహం అర్ధరాత్రికి అనుహ్యంగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

వరద ప్రవాహం నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌.. ఎగువ, దిగువ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకవైపు అల్పపీడనం, మరోవైపు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లను తిరిగి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, విజయవాడలలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు