వార్డు సచివాలయ అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్‌

30 Jul, 2019 21:01 IST|Sakshi

సందేహాల నివృత్తికి 79970 06763 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు

సాక్షి, అమరావతి: వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ నూతన వ్యవస్థల్లో పని చేయడానికి ఉద్యోగులను నియమించడానికి ప్రభుత్వం ఈ నెల 26న నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌలభ్యం కోసం గుంటూరులోని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు మొబైల్‌ నంబర్‌ 7997006763కు ఫోన్‌ చేయవచ్చు.

మంగళవారం నుంచి ఇది పని చేస్తుందని, ప్రతీరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ హెల్ప్‌ డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు దీన్ని గమనించగలరని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు