పరిహారమా.. పరిహాసమా..

7 Jul, 2016 01:03 IST|Sakshi

గత ఏడాది వరద నష్టంపై ఇప్పటికీ అందని సాయం
పంట నష్టం అంచనాలకే పరిమితం
ఏడు నెలలుగా రైతుల ఎదురుచూపు

 

గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వ ర్షానికి పంటలు కోల్పోయిన జిల్లా రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అట్టహాసంగా పంటల నష్టాన్ని అంచనాలు వేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించడంలో రైతులకు
ఏడు నెలలుగా మొండిచేయి చూపుతోంది. ముంపునకు గురైన పంటలకు సంబంధించిన రైతులు నష్టపరిహారం అందుతుందని నెలల తరబడి ఎదురుచూసి నిరాశ  నిస్పృహలకు గురవుతున్నారు.  
 
 
చిత్తూరు (అగ్రికల్చర్)  దశాబ్ద కాలంగా వరుస కరువులతో జిల్లావాసులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా గత నవంబర్‌లో అనుకోని రీతిలో భారీ వర్షం కురిసింది. నవంబర్‌లో సాధారణ వర్షపాతం 164.1 మిల్లీమీటర్లు. గత ఏడాది నవంబర్‌లో అత్యధికంగా 650.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో 5,593 హెక్టార్ల మేరకు పంటలు ముంపునకు గురయ్యాయి. రైతులకు రూ. 11.78 కోట్ల మేరకు నష్టం కలిగినట్లు అధికారులు అంచనా వేశారు. అందులో ఉద్యాన పంటలు 3,164 హెక్టార్లు దెబ్బతినగా, రూ. 4.78 కోట్లు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు 2,429 హెక్టార్ల మేరకు ముంపునకు గురికాగా రూ. 7 కోట్లు నష్టం సంభవించింది. ఇందులో వరి 1,790 హెక్టార్లు, వేరుశనగ పంట  167 హెక్టార్లు, ఇతర పంటలు 472 హెక్టార్లు ముంపునకు గురయ్యాయి.

 
నెలలు గడుస్తున్నా అందని పరిహారం

జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని నెల లు గడుస్తున్నా రైతులకు ప్రభుత్వం నష్టపరి హారం చెల్లించక కాలయాపన చేస్తోంది. నష్టపోయిన పంటలను కేంద్ర ప్రభుత్వ బృందం కూ డా జిల్లాకు విచ్చేసి పరిశీలించి అంచనా వేసింది. పంటలకు పరిహారాన్ని రైతులకు అందించడాన్ని మాత్రం మరచిపోయింది. పరిహారం అందకపోవడంతో రైతులు రోజురోజుకూ ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క చేతికందే దశలో పంటలను వర్షాల కారణంగా కోల్పోవడం, మరో పక్క వర్షం కురవడంతో కొత్త పంటలకు పెట్టుబడులు కూడా పెట్టలేక సతమతమయ్యారు. రబీలో పంటల సాగుకు రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోగా, ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా పరిహారం అందితే ఈ ఖరీప్ సీజనుకైనా ఆశించిన మేరకు అప్పులు చేయకుండా పంటలను సాగుచేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుచూస్తుంటే ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారాన్ని అందించే పరిస్థితులు ఏమాత్రం కానరావడం లేదు.
 
 
 ఇప్పటి వరకు పైసా వుుట్టలేదు
 నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. పొలం పైభాగంలో వెళుతున్న తెలుగుగంగ కాలువకు వుూడుచోట్ల గండ్లు పడ్డారుు. వెరుు్య ఎకరాల పంట నీట వుునిగింది. 300 ఎకరాలకు ఇసుక దిబ్బలు కట్టారుు. దానిలో నా భూమి ఐదు ఎకరాలు మొదట్లోనే  ఉంది. వుంత్రులతోపాటు స్థానిక నాయుకులు, అధికారులు పదేపదే పరిశీలన చేస్తే న్యాయుం జరుగుతుందని భావించాం. నెలలు గడిచిపోతున్నా పైసా కూడా అందలేదు.  -ఈశ్వరయ్యు, చిన్నకనపర్తి గ్రావుం, తొట్టంబేడు వుండలం
 
 ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు
 నవంబరులో కురిన భారీ వర్షాలకు దె బ్బతిన్న పంటలకు నష్టపరిహారం అంచాలు వేసి ప్రభుత్వానికి పంపాం.  వాటికి సంబందించిన నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇంతవరకు  రాలేదు.                 -విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ
 
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు