ఏపీ, తెలంగాణలో హై అలర్ట్‌!

9 Nov, 2019 03:31 IST|Sakshi

హైదరాబాద్‌లో భారీ భద్రత 

తీర్పు నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు 

విజయోత్సవాలు, నిరసనలు చేపట్టకూడదు

అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా 

సున్నిత ప్రాంతాల్లో పికెటింగ్‌ 

సోషల్‌ మీడియాపై పోలీసుల కన్ను

సాక్షి, హైదరాబాద్‌/అమరావతి: అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీస్‌ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదనే ఉత్తర్వులు వెలువడ్డాయి. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన, అనుమానిత ప్రాంతాలకు వాటర్‌ కెనన్లు, వజ్ర వాహనాలను తరలించనున్నారు. మరీ ముఖ్యంగా నిజామబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. 

సోషల్‌ మీడియాపై నిఘా
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా కామెంట్లు, పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. 

ఏపీ అంతటా అప్రమత్తం
అయోధ్య కేసులో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. డీజీపీ గౌతం సవాంగ్‌ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంద్రబాబు నాశనం చేశారు..జగన్‌ రిపేర్‌ చేస్తున్నారు’

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఆర్కే

ఈనాటి ముఖ్యాంశాలు

నష్టపోయిన ఏపీకి  సాయం అందించండి

రాజకీయ మనుగడ కోసమే ఇసుక రాజకీయాలు 

‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’

సీఎం జగన్‌పై నారాయణమూర్తి ప్రశంసలు

స్మగ్లర్ల ఆట కట్టిస్తాం: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

మెరుగైన రాష్ట్రం కోసం ముందుకు రండి: సీఎం జగన్‌

త్వరలో కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం

వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలు

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

‘ఆమె తీసుకున్న చర్యలు శూన్యం’

అంతర్జాతీయ కార్గోకు ఏపీ రాచబాట

సచివాలయాలకు సొంత గూడు 

మాటిచ్చారు... మనసు దోచారు...  

ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కేఎస్‌ఎన్‌

నిర్లక్ష్యం ఖరీదు 10 హత్యలు

పతులు ఉద్యోగులు.. సతులు డీలర్లు 

ఎలుకలు తెచ్చిన ఉపద్రవం!

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు 

మేమున్నామని.. నీకేం కాదని

నేటి విశేషాలు..

నువ్వెప్పుడో చచ్చావ్‌..పో..పో!

అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా అనంత

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

మీ ఇంటి అమ్మాయి అయితే ఇలానే చేస్తారా బాబూ?

శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాణి

టూరిస్ట్‌ హబ్‌ కానున్న ప్రకాశం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం

సూపర్‌హీరో అవుతా