మా ఉత్తర్వులంటే లెక్కలేదా?

13 Nov, 2016 02:19 IST|Sakshi

- ఉత్తర్వులు అమలు చేయకుండా ఇంకా గడువు కోరుతారా?
- గనుల శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం  

 సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా శంకవరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అనుమతులు లేకుండా లేటరైట్ ఖనిజ తవ్వకాలు జరుపుతున్న వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై గనుల శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? అంటూ న్యాయస్థానం ముందు హాజరైన అప్పటి గనుల శాఖ డెరైక్టర్ గిరిజాశంకర్‌ను ప్రశ్నించింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా, వాటి అమలుకు ఇంకా గడువు కావాలని కోరడంలో ఆంతర్యమేమిటని నిలదీసింది.

తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో వివరించాలని ఆదేశించింది. అలాగే గిరిజా శంకర్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహారుుంపునిచ్చేందుకు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు