అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పు

21 Dec, 2018 15:20 IST|Sakshi

హాయ్‌లాండ్‌ వేలానికి ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసులో ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. శుక్రవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం హాయ్‌లాండ్‌ వేలానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హాయ్‌లాండ్‌ విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందని యాజమాన్యం కోర్టుకు తెలపడంతో.. కనీస ధరను రూ.600 కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. సీల్డ్‌ కవర్‌లో బిడ్డర్స్‌ను ఆహ్వానించాలని కోర్టు ఆదేశించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న కోర్టు హాల్‌లోనే ఓపెన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. వెయ్యి కోట్లకు బిడ్డర్సును తీసుకువాలని, అప్పడే బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలిస్తామని యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై అగ్రిగోల్డ్‌ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు