ఎస్కేయూ, ద్రవిడ వీసీలకు  హైకోర్టు నోటీసులు 

16 Jul, 2019 07:19 IST|Sakshi

విచారణ రెండు వారాలకు వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లు రాజీనామా చేసినా... ద్రవిడ, ఎస్కేయూ వీసీలు మాత్రం ఆ పదవుల్లో కొనసాగుతుండడంపై హైకోర్టు వారి వివరణ కోరుతూ నోటీసులు జారీచేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సలర్లను నియమించే విషయంలో ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీలను రద్దు చేసి, యూజీసీ నిబంధనల మేర తాజాగా సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ప్రొఫెసర్‌ పి.మునిరత్నంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేశామని చెప్పారు. తర్వాత పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉగ్రనరసింహ వాదనలు వినిపిస్తూ, పలు విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు రాజీనామా చేసినా, ద్రవిడ, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల వీసీలు మాత్రం ఆ పదవుల్లో కొనసాగుతున్నారని, అందువల్ల వారిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చామన్నారు. దీంతో ధర్మాసనం ఆ ఇద్దరు వీసీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ప్రాణం తీసిన బిందె

హెచ్‌ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు

బీసీలను గుర్తించింది ఒక్క జగనే!

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్‌

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

స్కెచ్చేశాడు.. చంపించాడు

రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి!

ప్రజాధనం ఆదా

‘క్రయోజనిక్‌’లో లీకేజీ వల్లే..

టీటీడీలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వైవీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఒకటి అడిగితే సీఎం జగన్‌ రెండు చేస్తున్నారు..

రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు : అవంతి

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి

శ్రీపూర్ణిమ‌ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగ‌న్

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్‌ కమిటీ

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

ఆర్‌ అండ్‌ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్‌

దాతల విస్మరణ.. మాజీల భజన..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం