పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు

5 Sep, 2014 14:14 IST|Sakshi

గుంటూరు :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫాలపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిచేసి నలుగురు ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిన ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేయటం లేదంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి  పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, గుంటూరు రూరల్ ఎస్పీ, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిలను చేర్చారు.  


రెండు నెలల  క్రితం గుంటూరు జిల్లా మేడికొండురూ సమీపంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ప్రయాణిస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ నిందితులను గుర్తించలేదు.  పోలీసులు  కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం త్వరిగతగతిన విచారణ పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల తీరును తప్పుబట్టిన  న్యాయస్థానం ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.

>
మరిన్ని వార్తలు