'నైట్ డామినేషన్' వద్దు: హైకోర్టు

30 Mar, 2015 16:12 IST|Sakshi
'నైట్ డామినేషన్' వద్దు: హైకోర్టు

హైదరాబాద్: విజయవాడ పోలీసులకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్' రద్దు చేయాలంటూ న్యాయస్థానం సోమవారం ఆదేశాలిచ్చింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చిరంజీవి అనే న్యాయవాది ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఐడీ కార్డుల పేరుతో జనాన్ని వేధించటం సరికాదని వ్యాఖ్యానించింది.

బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా.. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను  ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు, చీకటి సందులు, గొందులు సైతం వదలకుండా గస్తీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ.. ఆపి వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తారు. గుర్తింపు కార్డులు లేకున్నా.. పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు.

మరిన్ని వార్తలు