ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై సర్కారుకు ఎదురుదెబ్బ

12 Sep, 2013 11:25 IST|Sakshi

సాక్షాత్తు గవర్నర్ నరసింహన్ చెప్పినా వినిపించుకోకుండా అస్మదీయులను అందలం ఎక్కించాలనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని రద్దుచేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. తాంతియాకుమారి, వెంకటేశ్వర్లు, ఇంతియాజ్, విజయ నిర్మల.. ఈ నలుగురి నియామకాలనూ రద్దు చేయాలని స్పష్టం చేసింది.

వెంకటేశ్వర్లు నియామకాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, దాని విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గవర్నర్ వద్దని చెప్పినా ఎందుకు వీరిని నియమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం నలుగురి నియామకాలను రద్దు చేసి, ఆరు వారాల్లోగా కొత్త కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. దీంతో కిరణ్ సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది.

మరిన్ని వార్తలు