గోశాల తరలింపుపై హైకోర్టు స్టే

9 May, 2015 04:51 IST|Sakshi
గోశాల తరలింపుపై హైకోర్టు స్టే

చిట్టినగర్ : గోశాల తరలింపుపై రాష్ర్ట హైకోర్టు స్టే ఇచ్చిందని విజయవాడ గోసంరక్షణ సంఘం అధ్యక్షుడు చింతలపూడి రఘురామ్ పేర్కొన్నారు. అర్జున వీధిలోని గోశాలలో శుక్రవారం  విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు.  కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నెల 28న జరిగన ఘటనలో గోవులు మృతి చెందడంతో గోశాలను వెంటనే ఖాళీ చేయాలని సీపీ నోటీసులు ఇచ్చారన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించగా గోశాలను యథాతథ స్థితిలో కొనసాగించాలని స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం గోశాలలో 250 ఆవులు ఉండగా, 12 వందలకు పైగా గోవులు ఉన్నట్లు పోలీసులు భావించారన్నారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.  సంఘ సెక్రటరీ కమల్ నాయన్ బంగ్, గోవింద్‌కుమార్ సాబూ,  సురేష్‌కుమార్ జైన్,  కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

23 మంది కమిటీ సభ్యుల అరెస్టు
గోవుల మృతి చెందిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై 23 మంది కమిటీ సభ్యులను వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కమిటీ  అధ్యక్ష, కార్యదర్శులైన  రఘురామ్‌తో పాటు కమల్‌జీలతో పాటు 23 మందిని అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

గోశాల పరిరక్షణ కోసం మౌన ప్రదర్శన
గోశాల పరిరక్షణ కోసం శుక్రవారం సాయంత్రం గోశాల కమిటీ సభ్యులు, గో ప్రేమికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. గోశాల నుంచి  కాళేశ్వరరావు మార్కెట్ వరకు సాగింది.

>
మరిన్ని వార్తలు