వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు స్టే

20 Mar, 2019 14:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. మంత్రాలయం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో నాగిరెడ్డిపై మాదవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పేమీ లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నాగిరెడ్డిని అరెస్ట్‌ చేయ్యవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. (మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు)

ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలం కగ్గల్లలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే . దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా స్థానికుల సమాచారం. గన్‌మెన్‌ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని బాలనాగిరెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు