గెయిల్ ఘటనపై ఆర్పి సింగ్ కమిటీ విచారణ

28 Jun, 2014 12:57 IST|Sakshi

అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా గెయిల్‌ గ్యాస్‌పైప్‌ లైన్‌ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు కమిటీ సిద్ధమైంది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పి సింగ్ నేతృత్వంలో ఏర్పాటు అయిన ఉన్నతస్థాయి కమిటీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించనుంది. దుర్ఘటన పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజాన్ని నిగ్గు తేల్చనుంది.

శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్‌ గ్యాస్‌ స్టేషన్‌ సమీపంలో గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లేన్‌లో పేలుడు సంభవించి.... 16 మంది సజీవ దహనమయ్యారు. ఘటనపై స్పందించిన కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉన్నతస్థాయి కమిటీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న గెయిల్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు