‘హై సెక్యూరిటీ’కి బ్రేక్!

25 Apr, 2014 00:40 IST|Sakshi
‘హై సెక్యూరిటీ’కి బ్రేక్!

    నాణ్యత ప్రమాణాలు నిల్
     వాహనదారుల ఫిర్యాదుపై స్పందన

 
విశాఖపట్నం, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడింది. నాణ్య త ప్రమాణాలు పాటించడం లేదని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సేవలు నిలిచాయి. బోర్డుల తయారీ సక్రమంగా జరగడం లేదని తెలిసి అధికారులు అడ్డుకట్ట వేశారు.

బుధవారం నుంచి బోర్డుల ప్రక్రియ కొనసాగడం లేదు. రక్షణ, భద్రత లక్ష్యం గా అమలులోకి వచ్చిన ‘హై సెక్యూరిటీ’ నంబర్ బోర్డుల విధానం విమర్శలకు దారి తీస్తోంది. బోర్డుల తయారీపై ఆరోపణలు వచ్చాయి. మోటారు వాహనాల చట్టంలో తెలిపిన ప్ర మాణాలు తయారీ సంస్థ పాటించడం లేదని, చెల్లించిన ధరకు తగ్గట్టుగా బోర్డులు లేవంటూ వాహనదారులు ఫిర్యాదులు చేశారు. విశాఖలో మార్చి 10 నుంచి హైసెక్యూరిటీ బోర్డుల వినియోగం అమలు జరుగుతోంది.
 
బోర్డుల తయారీలో నాణ్యత పట్ల వాహన యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో బోర్డులను ‘లింక్ ఆటో టెక్’ సంస్థ తయారీ చేస్తోంది. బోర్డుల నాణ్యత, తయారీ అంశాలను రవాణా, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షిస్తారు. తయారీ సంస్థ నిబంధనలు పాటించకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తు న్నాయి. చట్టంలో నిబంధనలు తయారీ సంస్థ సక్రమంగా అమలు చేస్తోందా, లేదా అనే విషయాన్ని  ధ్రువీకరించాల్సి ఉంది.

ఒక వేళ ప్రమాణాలకు విరుద్ధమని తెలిస్తే సంస్థ బాధ్యత వహించాలి. ఈ విషయమై ఇప్పటికే తయారీ సంస్థకు సూచనలు, హెచ్చరికలు జారీ చేసి నట్టు సమాచారం. బోర్డుల తయారీలో నాణ్యత పాటించి సరఫరా చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
 

>
మరిన్ని వార్తలు