కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్

10 Dec, 2014 10:49 IST|Sakshi
కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోని కోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు.  

2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి కోడుమూరుకు వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో బయలుదేరారు. కాగా వారి కోసం ముందుగానే దేవనకొండ మండలం మాచాపురం వద్ద ఆయన ప్రత్యర్థులు కాపుకాచి కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు పది మంది మరణిచారు. దీంతో కప్పట్రాళ్ల వెంకటపనాయుడి కుమారుడు ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాంతో ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల నివేదిక ఆధారంగా ఈ హత్య కేసును పత్తికొండ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు తీసుకుంది. నిందితుల భద్రత దృష్ట్యా ఈ కేసును ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చారు. ఈ కేసులో తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్గా కప్పట్రాళ్ల  వెంకటప్పనాయుడు 27 ఏళ్ల వయస్సులోనే ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు