పేదింటి విద్యార్థులకు..పెద్ద చదువులు

4 May, 2018 13:19 IST|Sakshi

ట్రిఫుల్‌ ఐటీ ప్రవేశాలకు వెలువడిన ప్రకటన

ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తులు స్వీకరణ

పశ్చిమ గోదావరి, నిడమర్రు : గ్రామీణ ప్రాంతాల్లోని పేదింటి విద్యార్థులకు పెద్దింటి చదువులు అందించాలనే ఉన్నత లక్ష్యంతో దివంగత వైస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవే ట్రిపుల్‌ ఐటీ కళాశాలలు. ఈ ఆర్‌జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ కేంద్రాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల సమీకృత బీటెక్‌ డిగ్రీ విద్యా కార్యక్రమంలో 2018–19 సంవత్సరానికి మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

10 జీపీఏ సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు
ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో జిల్లాలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 1,581 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన వారు తక్కువగానే ఉన్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ప్రభుత్వ విద్యార్థికి సీటు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు 10 జీపీఏ గ్రేడ్‌ పాయిట్స్‌కు దిగువున ఉన్న గ్రేడ్స్‌ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులందరూ ట్రిపుల్‌ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీ కేంద్రాల్లో అభ్యసించేందుకు అవసరమైన దరఖాస్తులు జూన్‌ 8వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.
ప్రవేశ అర్హతలు  ఇలా.. అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే 2018లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఏపీ/తెలంగాణ రాష్ట్రాల్లో రెగ్యులర్‌ విద్యార్థిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్‌ఈలో పది చదివినవారు కూడా అర్హులే.

వయోపరిమితి
2018 డిసెంబర్‌ 31 నాటికి 18 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వయోపరిమితిలో 21 ఏళ్ల వరకూ సడలింపు ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇలా..
అభ్యర్థులు కేవలం ఏపీఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.  
మీ సేవా కేంద్రాల నుంచి ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఓసీ, బీసీలకు రూ.150, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 ఏపీఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి.
అప్లికేషన్‌తోపాటు సర్వీస్‌ చార్జి కింద ఆన్‌లైన్‌ సెంటరుకు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుతోపాటు పదో తరగతి హాల్‌ టికెట్‌
పది పరీక్షల్లో సాధించిన గ్రేడ్‌ పాయింట్స్‌ ఏవరేజ్‌(జీపీఏ) సర్టిఫికెట్‌
ఇతర రిజర్వేషన్లు ఉంటే(స్పోర్ట్‌/ఎన్‌సీసీ/క్యాప్‌/దివ్యాంగ) వాటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు.

రిజర్వేషన్‌ కోటాలు ఇలా
ఒక్కో కళాశాలలో 85 శాతం సీట్లు స్థానికంగానూ,  మిగిలిన 15 శాతం సీట్లు మెరిట్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
ప్రతీ వంద మంది విద్యార్థుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఏ 7 శాతం, బీసీ–బీ 10 శాతం, బీసీ–సీ 1 శాతం, బీసీ–డీ 7 శాతం, బీసీ–ఈ 4 శాతం
సీట్లలో ప్రత్యేక కోటాకింద దివ్యాంగులకు 3 శాతం, సైనిక ఉద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్‌ కోటాకింద 0.5 శాతం సీట్లు భర్తీ చేస్తారు.
నూటికి 33.33 శాతం సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.

ఫీజుల విరాలు
ఏపీ/తెలంగాణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు కింద ప్రతీ ఏటా రూ.36 వేలు చొప్పున చెల్లించాలి. తెల్లకార్డు ఉన్న వారు/ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌కు అర్హులైనవారు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పొందాలంటే విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థి కుటుంబాలకైతే రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలి.
రిజిస్ట్రేషన్‌ ఫీజుకింద ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లించాలి.
కాషన్‌ డిపాజిట్‌ కింద అన్ని కేటగిరి అభ్యర్థులూ రూ.2 వేలు చెల్లించాలి.
ఇతర రాష్ట్రాలు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే వారి పిల్లలకు ఏడాదికి ట్యూషన్‌ ఫీజుకింద రూ.1.36 లక్షలు చెల్లించాలి
విదేశీ/ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించినప్పటి రసీదు, టెన్త్‌ హాల్‌ టికెట్, మార్కుల లిస్ట్, నివాస ధ్రువీకరణ పత్రం, బీసీ/ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు కుల« ధ్రువీకరణ పత్రాలు,
దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికోద్యోగుల పిల్లలకు సంబంధిత అధికారి జారీచేసిన సర్టిఫికెట్‌
ఎన్‌సీసీ/స్పోర్ట్‌ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి.

ఎంపిక ఇలా..
టెన్త్‌ పరీక్షల్లో సాధించిన విద్యార్థుల గ్రేడ్‌ల వారీగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గ్రేడ్‌ పాయింట్స్‌ సమానమైతే వారి ఎక్కువ జీపీఏ సాధించిన(గణితం, జనరల్‌ సైన్స్, ఇంగ్లీషు, సోషల్‌) సబ్జెక్ట్‌ వారీగా సాధించిన గ్రేడ్‌ పాయిట్స్‌ పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ గ్రేడ్‌ పాయింట్స్‌లోనూ పోటీఉంటే, పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్దవారిని ఎంపిక చేస్తారు.
నాన్‌    రెసిడెన్షియల్‌ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలు, ఏపీ మోడల్స్‌ స్కూల్స్,  కేంద్రీయ విద్యాలయాలు, కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో టెన్త్‌ చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏను అదనంగా కలిపి కౌన్సెలింగ్‌లో ప్రతిభను నిర్ధారిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ఆరేళ్లపాటు ల్యాప్‌టాప్, ప్రతీ ఏటా మూడు జతల డ్రస్సులు, రెండు జతల షూలు, హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది.

ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూన్‌ 8
పీహెచ్‌/క్యాప్‌/ఎన్‌సీసీ/స్పోరŠట్ప్‌ విద్యార్థులు పోçస్టులో పంపిన
ధ్రువీకరణ పత్రాల కాపీలు స్వీకరించుటకు ఆఖరి తేదీ: జూన్‌ 11
పీహెచ్‌/క్యాప్‌/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ : జూన్‌ 18, 19
స్పెషల్‌ కేటగిరి సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకటన (ఫేజ్‌–1) జూన్‌ 29
ఇతర రాష్ట్రాలు, ఇంటర్నేషనల్‌ విద్యార్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అడ్మిషన్స్‌    జులై 6,7
స్పెషల్‌ కేటగిరి సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకటన (ఫేజ్‌–2) జులై 16
ట్రిఫుల్‌ ఐటీ నూజివీడు క్యాంపస్‌     ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌/అడ్మిషన్స్‌ జులై 21 నుంచి 23 వరకూ
ట్రిఫుల్‌ ఐటీ నూజివీడు క్యాంపస్‌ అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు  ఓరియంటేషన్‌ తరగతులు: జులై 24 నుంచి 31 వరకూ
ట్రిఫుల్‌ ఐటీ నూజివీడు క్యాంపస్‌ 2018–19 ట్రిపుల్‌ ఐటీ బ్యాచ్‌ తరగతుల ప్రారంభం: ఆగస్టు 1

మరిన్ని వార్తలు