అగ్ని గుండం

23 May, 2015 01:38 IST|Sakshi

 రాజమండ్రి : జిల్లా అగ్నిగుండంగా మారింది. నా లుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రత శుక్రవారం మరింత భీకరరూపం దా ల్చింది. వడవెబ్బ రూపంలో 14 మందిని బలి తీసుకుంది. రాజమండ్రిలో అత్యధికం గా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడలో 42.2, అమలాపురంలో 42 డిగ్రీల ఉ ష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలే కాకుండా అత్పల్ప ఉష్ణోగ్రతలు కూ డా పెరగడం వల్ల ఉదయం, సాయంత్రం కూడా వడగాడ్పులు వీస్తూ యువతను సై తం భయపెడుతున్నాయి. ఫ్యాను కింద కూ ర్చున్నా వేడిగాలి తగులుతుండడంతో జనం మగ్గిపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నగరాలు, పట్టణాల్లో అప్రకటిత కర్ఫ్యూవాతావరణం కనిపిస్తోంది. రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ మండిపడే వేళ.. నగరాలు, పట్టణాలలోనే కాక పల్లెల్లో అనేకులు ఇళ్లకు పరిమితమవుతున్నారు. పలుచోట్ల విద్యుత్ రఫరా లేక వేగిపోతున్నారు. శీతలపానీయాలు, ముంజలు, జ్యూస్‌ల అమ్మకాలు ముమ్మరమయ్యూరుు. రోహిణీ కార్తె మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పుడే ఇంతలా రగులుతున్న వాతావరణం.. ఇక ఆ సమయంలో ఇంకెంత విజృంభిస్తుందోనని జనం బెంబేలెత్తుతున్నారు.
 
 కార్పొరేట్ విద్యాసంస్థలు అతీతమా?
 వేసవి సెలవులైనా, ఎండలు గండం స్థారుులో మండిపోతున్నా నగర, పట్టణాల్లో చాలా కార్పొరేట్ స్కూల్స్, కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు యథావిధిగా నడిచిపోతున్నాయి. స్కూళ్లతో తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులు, కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు సెలవులకు నోచుకోలేదు. వడగాడ్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నా సెలవులు ఇవ్వాలని ఇటు యాజమాన్యాలకూ, పాఠాలు చెపుతున్నా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ పంపకూడదని ఇటు తల్లిదండ్రులకూ లేకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు