పోలీసుల అదుపులో హైవే కిల్లర్స్ గ్యాంగ్

13 Jan, 2014 04:21 IST|Sakshi

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: హైవేలో లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చి, లారీ నెంబర్లు మార్చి విక్రయించే మున్నా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్‌జీఓ కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించగా గ్యాంగ్ లీడర్ మున్నా సహా 8 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను జిల్లా కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. విద్య, వ్యాపార సంస్థలు, నివాస గృహాలతో ప్రశాంతంగా ఉండే ఎన్‌జీఓ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌ను కర్నూలు నుండి రెండు వాహనాల్లో వచ్చిన పోలీసుల బృందం తమ అదుపులోకి తీసుకుంది. 3వ అంతస్తులోని ఓ ఫ్లాట్ ఉన్న మున్నాతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వీరి నుండి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా, స్కోడా కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానిక దేవనగర్, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ జిల్లా కేంద్రానికి తరలించారు. ఇదిలాఉండగా మున్నా గ్యాంగ్‌పై ప్రకాశం జిల్లాలో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. బ్రోకర్ల ద్వారా లారీలను అద్దెకు తీసుకోవడం, మార్గమధ్యంలో డ్రైవర్, క్లీనర్‌ను అంతమొందించి లారీలను విక్రయించి సొమ్ము చేసుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అర్బన్, రూరల్, టంగుటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఠాపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అసలేం జరుగుతోంది..?

భార్యను కడతేర్చిన భర్త

కొలువుల కొలుపు 

పోటాపోటీగా వరద ప్రవాహం

లక్ష్యం వైపు అడుగులు

సముద్రంలో స్నానం చేస్తూ...

నేరాలపై ఉక్కుపాదం

దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ

మహిళా ఉద్యోగిపై...

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పల్లెతల్లి సేవకు తొలి అడుగు

భారీ వరద వేళ ప్రజాప్రతినిధుల సాహసం

లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...

లేదే కనికరం.. రాదే పరిహారం!

సైనికుల్లా పనిచేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం 

గుండెపోటుతో వీఆర్వో మృతి

సాక్షి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డులు

‘సాహిత్య సంపద డిజిటలైజేషన్‌’ వేగవంతం

నైజీరియా పక్షుల సందడి లేదు..

టాస్క్‌ఫోర్స్‌ టైగర్‌కు వీడ్కోలు

పాత ప్రీమియంతోనే వైఎస్సార్‌ బీమా

ఇక వర్షాలే వర్షాలు

సీపీఎస్‌ రద్దుకు సర్కారు కసరత్తు

శ్రీకాకుళం నుంచి శ్రీకారం

అన్నదాత పై అ‘బీమా’నం

పోలవరం అక్రమాలపై ‘రివర్స్‌’ పంచ్‌

మా వైఖరి సరైనదే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌