హిజ్రాతో సహజీవనం.. ఆపై అనుమానంతో

19 Jul, 2017 14:36 IST|Sakshi
హిజ్రాతో సహజీవనం.. ఆపై అనుమానంతో
విజయనగరం: ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న హిజ్రా మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడో వ్యక్తి. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన శ్రీకాంత్‌, రమేష్‌ అలియాస్‌ రమ్య అనే హిజ్రాతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు.
 
ఈ క్రమంలో రమ్య తనతో పాటు మరి కొంతమందితో కూడా సంబంధం కొనసాగిస్తోందని శ్రీకాంత్‌ అనుమానించాడు.​ ఈ విషయంపై ఆమెతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్‌ నిద్రిస్తున్నరమ్యపై సమ్మెటతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వార్తలు