కొండ క్యూలో చీకట్లు

28 Dec, 2014 02:08 IST|Sakshi
కొండ క్యూలో చీకట్లు

నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులకు కష్టాలు
పర్యవేక్షించని  అధికారులు
ఈవో చొరవ చూపాలని భక్తుల విజ్ఞప్తి

 
తిరుమలలోని నారాయణగిరి క్యూలలో శనివారం రాత్రి అంధకారం నిండిపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన సామాన్య భక్తులు అవస్థలు పడ్డారు. 4 రోజులుగా తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అధికారుల బృందం కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై మాత్రమే దృష్టి సారించింది. అన్ని విభాగాల అధికారులు కేవలం వీఐపీలకు దర్శన పాసులు, గదుల కేటాయింపు కోసమే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు.    
 
తిరుమల:  భక్తుల రద్దీ ఏర్పాట్ల ను కొందరు అధికారులు తప్ప అధిక సంఖ్యలోని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి కాలిబాట భక్తుల క్యూలలో వెలగని విద్యుత్‌ద్దీపాలే ఇందుకు నిదర్శనం. మధ్యలో పెద్ద ఫ్లడ్‌లైటు మాత్రమే వెలిగించా రు. క్యూల పక్కనే ఏర్పాటు చేసిన మిగిలిన లైట్లను వెలిగించడం మరిచారు. భక్తులకు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు, ఇంజినీర్లు ముఖం చాటేయడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఫలి తంగా భక్తులకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. చీకటిలోనే శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప కమ్మీల బోల్టులు రాసుకుని చాలా మంది భక్తులు ఇబ్బందులు చవి చూశారు. సమస్యపై ఈవో చొరవ చూపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు