కరోనాతో హిందూపూర్ వాసి మృతి

4 Apr, 2020 10:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అనంతపురం : కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. అనంతపురం జిల్లా హిందుపురానికి చెందిన ముస్తాక్‌ ఖాన్‌ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అతని మరణాన్ని ధృవీకరించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరింది. అలాగే పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. (ఏపీలో తొలి కరోనా మరణం)

ఆ 16మందికి కరోనా లేదు
కాగా ఢిల్లీలోని జమాత్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 16మంది హిందూపూర్ వాసులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. వారందర్నీ ఇదివరకే క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే. వీరందరికి నెగిటివ్‌ రావడంతో పట్టణ ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హిందూపురంలో ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బంధువులు, ఆమెను కలిసిన 19మందికి  కూడా వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించి అనంతపురం పంపారు. వీరి ఫలితాలు తెలియాల్సి ఉంది. కాగా  కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.  (ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు)

ఆ ఏడుగురికి కరోనా వైరస్‌ లేదు
బత్తలపల్లి మండల కేంద్రం బత్తలపల్లికి చెందిన ఏడుగురు ముస్లిం మైనార్టీలు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి రావడంతో కరోనా అనుమానిత లక్షణాలు ఉండచవ్చని క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వీరికి కోరనా వైరస్‌ సోకలేదని వైద్య పరీక్షల్లో తేలిందని తహసీల్దార్‌ ఖతిజిన్‌కుఫ్రా తెలిపారు. అయితే వీరు 15 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగరాదని సూచించారు.

మరిన్ని వార్తలు