సహాయక చర్యల్ని పర్యవేక్షించిన హోంమంత్రి

4 Aug, 2019 18:55 IST|Sakshi

సహాయక చర్యల్ని పర్యవేక్షించిన హోంమంత్రి సుచరిత

సాక్షి, గుంటూరు : ఎడతెరిపిలేని వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. తాగునీరు, కిరోసిన్, బియ్యం, కందిపప్పు అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు లేవని, ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకు రాజకీయ దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బాబు, ఇప్పుడు సంక్షేమం కుంటుపడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇస్తామన్న టీడీపీ అధ్యక్షుడు రెండు నెలలకే ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కోడెల కుటుంబ సభ్యులు తప్పుడు పనులు చేయకపోతే బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు త్వరలో ప్రారంభవుతాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు