కలల ప్రాజెక్ట్‌.. నిర్లక్ష్యం ఎఫెక్ట్‌

8 Apr, 2018 10:37 IST|Sakshi

గణనీయంగా తగ్గిపోయింది. పోర్ట్‌ కార ణంగా మత్స్య సంపద తగ్గిపోవడం, మత్స్యకారులకు ఉపాధి దొరక్కపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం ప్రకటించడంతో మత్స్యకారుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. 2014 నుంచి అధికా రులు దశల వారీగా పలు సర్వేలు నిర్వహించి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి డీపీఆర్‌ కూడా సిద్ధం చేశారు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ చట్టం అనుమతులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సు మారు రూ.242 కోట్లతో చేపట్టనున్న ఈ ఫిషింగ్‌ హార్బర్‌కు సాగరమాల పథకం కింద కేంద్రం రూ.121 కోట్లు, రాష్ట్రం వాటా కింద రూ.121 కోట్లు కేటాయిం చాల్సి ఉంది. బడ్జెట్‌లో రాష్ట్రం తన వాటా కేటాయిస్తే కేంద్రం వెంటనే తన వాటా కూడా మంజూరు చేస్తుంది. బడ్జెట్‌లో రాష్ట్రం ఒక్కపైసా కూడా కేటాయించకపోవడంతో కేంద్రం కూడా జాప్యం చేస్తుంది. 

వేట సాగక..పూటగడవక.. 
జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు 12 మండలాల్లో 118 గ్రామాలను కలుపుతూ 169 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు సముద్రం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా వేట విరామ సమయంతో పాటు అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలతో వేట సరి గా సాగదు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు మధ్య కూడా మత్స్యకారులు కడలిపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. 

60 శాతం మత్స్య సంపద దళారుల పాలు
జిల్లా తీరంలో ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నా కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. సరైన వసతులు, స్టోరేజ్‌ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతుంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలు సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న 1.05 లక్షల టన్నుల ఉత్పత్తి రెట్టింపవుతంది. 

మినీ హార్బర్‌ కారణంగా పెద్దబోట్లు సంఖ్య పెరిగి ఏడాదికి 2 లక్షల టన్నుల ఉత్పత్తి బయటకు వస్తుంది అంచనా. ఎగుమతులు కూడా 40 నుంచి 80 శాతానికి పెరుగుతాయి. ఎగుమతులతో ప్రస్తుతం వస్తున్న రూ.200 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్లు కలిపి ఏడాదికి జిల్లా కు రూ.400 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉంది. మినీ హార్బర్‌లో స్టోరేజ్, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండటంతో దళా రుల ఆగడాలు తగ్గి ప్రాణాలు పణంగా పెట్టి వేట సాగించిన మత్స్యకారులకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుంది.   

సా.. గుతున్న ప్రతిపాదనలు 
జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్‌ హా ర్బర్‌ నిర్మాణానికి సంబంధించి 2014 లోనే బీజం పడింది. సాగరమాల పథకం కింద మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి సర్వే ప్రారంభించిన అధికారులు జువ్వలదిన్నె సమీపంలో చిప్పలేరు వద్ద ఉన్న సముద్ర ముఖ ద్వార ప్రాంతం అనుకూలంగా ఉం టుందని గుర్తించారు. పలు దఫాలుగా సర్వే చేసిన అధికారులు స్థల సేకరణ కూడా పూర్తిచేసి సాంకేతిక పరమైన సర్వేలు ప్రారంభించారు. వ్యాప్‌కోస్‌ సంస్థ తీరంలో వాతావరణం, మట్టి స్వభావం, సోషియో ఎకనమికల్‌ సర్వేలు, జియాలజికల్‌ సర్వేలు, ఇలా మూడున్నరేళ్ల పాటు పలు రకాల సర్వేలన్నీ పూర్తి చేసిన తర్వాత 242.22 కోట్ల అంచనాతో డీపీఆర్‌ కూడా సిద్ధం చేసింది. సాగరమాల కింద రాష్ట్రం 50 శాతం వాటా కేటాయిస్తే కేంద్రం కూడా తన వాటా జమచేసి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించిన తర్వాత మూడేళ్లకు కానీ నిర్మాణం పూర్తికాదు. మినీ ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు ఐస్‌ ఫ్యాక్టరీ, వలలు, పడవల మరమ్మతులు, చేపలు ఆరబెట్టుకునే ఫ్లాట్‌ఫాంలు, చేపల ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుతో మత్స్యకారలు జీవితాల్లో వెలుగులు నిండుతాయి. 

పబ్బం గడుపుకునేందుకే.. 
జిల్లాలో 2 లక్షల మంది మత్స్యకారల జీవితాలు ఆధారపడిన మినీఫిషింగ్‌ హార్బర్‌పై అధికార పార్టీ నాయకుల్లో చిత్తశుద్ధి కనబడటంతో లేదు. కడలి తీరా న్ని కబ్జాచేసి కాసుల తీరంగా మార్చుకున్న అధికార పార్టీ నాయకులు మత్స్యకారుల బతులకును ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరో పణలు లేకపోలేదు. మత్స్యకార గ్రా మాల్లో  ‘దురా యి’ సంస్కృతిని అడ్డం పెట్టుకుని ఇ న్నాళ్లు అధికార పార్టీ నేతలు తమ ప బ్బం గడుపుకుంటున్నారు. మత్స్యకారుల్లో చైతన్యం వచ్చినా, ఆర్థికంగా బలపడినా తమ పునాదులు కదులుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయించకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఫిషింగ్‌ హార్బర్‌ విషయంలో నోరుమెదపడటం లేదు.  

ఉత్పత్తి రెట్టింపు అవుతుంది
జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి రెట్టింపవుతుంది. ఎగుమతులు పెరగడంతో పాటు మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. ప్రస్తుతం సీఆర్‌జెడ్‌ చట్టం అనుమతుల పరిశీలనలో ఉంది. నిధులు మంజూరైన తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.        
పీ ప్రసాద్,మత్స్యశాఖ అధికారి, కావలి 

మరిన్ని వార్తలు