ఈ ఆవు.. కామధేనువు!

18 Jun, 2019 12:12 IST|Sakshi

సాక్షి, కోటవురట్ల (పాయకరావుపేట): ఓ పాడి రైతు పంట పండింది. హార్మోన్ల లోపంతో జన్మించిన పడ్డ (ఆవు) ఆ రైతుకు కామధేనువైంది. చూడి కట్టకుండానే పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశాఖ జిల్లా కోటవురట్ల మండలం బీకే పల్లికి చెందిన రైతు కన్నూరు రమణ.. హెచ్‌ఎఫ్‌ జాతికి చెందిన పడ్డను కొనుగోలు చేశారు. రెండేళ్ల వయసున్న ఈ పడ్డ చూడి కట్టకుండానే పాలు ఇస్తోంది. 10 రోజుల క్రితం ఎదకు రావడంతో రైతు రమణ పశు వైద్య కేంద్రానికి తీసుకొచ్చాడు.

పొదుగు బాగా పెరిగి ఉండడాన్ని గమనించిన పశు వైద్యాధికారి పెట్ల నరేష్‌ పాలు పిండి చూడమని సూచించారు. అక్కడికక్కడే పిండగా 2 లీటర్ల పాలు ఇచ్చింది. రోజు రోజుకు పాల దిగుబడి పెరుగుతోందని రైతు తెలిపాడు. దీనిపై పశు వైద్యాధికారిని వివరణ కోరగా.. హార్మోన్ల లోపం కారణంగా ఇలా జరుగుతోందన్నారు. ఇది అరుదైన విషయమని, పాల వల్ల హాని ఉండదన్నారు. 

మరిన్ని వార్తలు