అన్ని జిల్లాల్లో.. రూ.100కే పండ్లకిట్‌

19 Apr, 2020 08:36 IST|Sakshi

ఉద్యాన శాఖ నిర్ణయం

కర్నూలు జిల్లాలో విజయవంతంగా అమలు

గుంటూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లోనూ విక్రయాలు

మరో 5 జిల్లాల్లో వెండర్ల ద్వారా అమ్మకాలు

సాక్షి, అమరావతి: ఫ్రూట్‌ కిట్ల విక్రయాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్లకు శనివారం లేఖలు రాశారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం ప్రయోగాత్మకంగా అమలు చేసిన రూ.100కే పండ్ల కిట్‌ అమ్మకం విజయవంతమైనందున రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.  

లేఖలో అంశాలివీ.. 

  • స్థానికంగా దొరికే ఏవైనా ఐదు రకాల పండ్లను కిట్‌ రూపంలో తయారు చేసి రూ.100 చొప్పున  విక్రయించాలి. 
  • ఇందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో), ఉద్యాన శాఖ సహకారాన్ని తీసుకోవచ్చు.  
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 350 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు తీసుకోవాలి.  
  • ఆ సూత్రం ఆధారంగా కరోనా వైరస్‌ వ్యాధి నివారణకు ఉపయోగపడే విటమిన్‌ ఏ, సీ ఉండే పండ్లను పంపిణీ చేయాలి. 

అనూహ్య  స్పందన

  • ‘లాక్‌డౌన్‌ సమయంలో.. రైతు సేవలో ఎఫ్‌పీవోలు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్తకు వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వచి్చంది.  
  • వందలాది మంది ఫోన్లు చేసి పండ్ల కిట్ల పంపిణీలో పాలు పంచుకుంటామని చెప్పినట్లు ఉద్యాన శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి.హనుమంతరావు తెలిపారు.  
  • అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, పండ్ల వ్యాపారులు, ఏజెంట్లు, పండ్ల రైతులు, వెండర్లు.. ఇలా అన్నివర్గాల నుంచి స్పందన రావడంతో వాళ్లను సమీపంలోని ఎఫ్‌పీవోలకు అనుసంధానం చేశామన్నారు. 

ఇతర జిల్లాలకూ విస్తరిస్తున్నాం
ప్రజల వద్దకే పండ్ల పంపిణీ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచి్చనందున ఇతర జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదురి తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే.. 

  • గుంటూరు, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పండ్ల కిట్ల పంపిణీ ప్రారంభమైంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. 
  • చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పు, పశి్చమ గోదావరి జిల్లాల్లో వెండింగ్‌ వ్యాన్ల ద్వారా ఉద్యాన శాఖ సిబ్బంది అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లు, సొసైటీల వద్ద ప్రభుత్వం అనుమతి ఇచి్చన సమయంలో విక్రయిస్తున్నారు. 
మరిన్ని వార్తలు