చెట్టంత అనుబంధం

20 Apr, 2018 06:38 IST|Sakshi
చెట్టును తొలగించకుండానే ఆస్పత్రి నిర్మించిన డాక్టర్లు

గుంటూరు మెడికల్‌: ఆ మహావృక్షానికి, ఆ ఇంటికీ అనుబంధం 60 ఏళ్లు. ఆ మహావృక్షంలా అందరూ జీవితంలో ఉన్నతంగా ఎదిగారు. డాక్టర్లుగా స్థిరపడ్డారు. గుంటూరు నగరంలో ఆస్పత్రి కట్టేందుకు చెట్టు అడ్డమైంది. కుటుంబ సభ్యుల మనసుల్లో గ్రీష్మకాలాన ఎండిన మోడులా వేదన మొదలైంది. అప్పుడు వారి మదిలో ఓ ఆలోచన వసంతమై చిగురించింది. కుటుంబంలో చెట్టును భాగం చేసుకోవాలని.. చిన్నప్పుడు ఆ చెట్టు కింద అమ్మ పెట్టిన గోరుముద్దల తియ్యదనం గుర్తు చేసుకుంటూ ఉండాలని..

అల్లుకున్న వేరుల్లా చెట్టుకు, తమకు అనుబంధం వీడిపోకుండా చేయాలని.. అందుకే చెట్టుకు కొంత స్థలం వదిలారు. ఆస్పత్రిలోనే చెట్టును భాగం చేశారు. పర్యావరణహితులై ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారే గుంటూరులోని కొత్తపేట ఓల్డ్‌ క్లబ్‌ రోడ్డులో మల్లిక స్పయిన్‌ సెంటర్‌ అధినేత, వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణులు జెరుబులగిన్నె నరేష్‌బాబు. వీరి తల్లి డాక్టర్‌ ఓలేటి శివలీల గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, తండ్రి ప్రొఫెసర్‌ రంగస్వామి జీజీహెచ్‌లో ఫిజిస్ట్‌గా పదవీ విరమణ చేశారు. సోదరులు డాక్టర్‌ మహేష్‌బాబు కార్డియాలజిస్ట్‌గా, డాక్టర్‌ రంగనా«థ్‌ నెఫ్రాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆస్పత్రి నిర్మించిన స్థలంలో గతంలో వీరి ఇల్లు.

మరిన్ని వార్తలు