ఇవేమి వసతి గృహాలు

25 Feb, 2014 01:40 IST|Sakshi

 విద్యార్థులను ఇలాగేనా చూసుకునేది!
 కనీస సౌకర్యాలు కూడా లేవు
 మెనూ ప్రకారం భోజనమూ లేదు
 ఆకస్మిక తనిఖీలు చేసి నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు
 
 కామారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్
 ‘‘ఇంత ఘోరమా... హాస్టల్‌ను నిర్వహించేది ఇలాగేనా’’ అంటూ ఏసీబీ అ ధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం పక్కన గల ఎస్‌టీ బాలుర హాస్టల్‌లో వారు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త తనిఖీలలో భాగంగా ఇక్కడా సోదా లు చేశామన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. హాజరు పట్టిక తప్పుడు తడకగా ఉందని పేర్కొన్నారు. హాస్టల్ భవనం, తరగతి గదులు, స్నానాల గదులు, మరుగుదొడ్లు, స్టోర్ రూం, వంట గదిని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డెన్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. అసలు ఇలాగేనా విద్యార్థులను చూసుకునేది అని మండిపడ్డా రు. ‘‘మెనూ ప్రకారం భోజనం పెట్టడం లే దు. ఏ ఒక్క గదిలో కూడా ఫ్యాన్లు సరిగా లేవు, దోమతెరలు లేవు, పది మరుగుదొడ్లు ఉంటే రెండు మాత్రమే వాడుతున్నారని వివరించారు. స్టోర్ రూంలో బియ్యం, వంట సామగ్రిని చూసి వార్డె న్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగినా రికార్డులను ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టి, రికార్డులను స్వాధీనం చేసుకున్నా రు. పూర్తి విచారణ అనంత రమే చర్యలుంటాయని అన్నారు.
 
 ఇక్కడా అంతే
 గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని సోమవారం రాత్రి నిజామాబాద్ ఏసీబీ డీఎస్‌పీ సంజీవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌చార్జ్ వార్డెన్ నర్సిం హులు అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఫోన్‌లో సంప్రదించారు.
 
 ఏసీబీ డీఎస్‌పీ అని చెప్పగానే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజులుగా బీసీ హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని డీఎస్‌పీ తెలిపా రు. హాస్టల్ నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. మౌలిక వసతులు లేవని అన్నారు. 89 మంది విద్యార్థులకుగాను 24 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని హాస్టళ్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా