బతికేది ఎలా?

4 Jun, 2014 02:25 IST|Sakshi
బతికేది ఎలా?

 నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రెండు నెలలుగా పింఛన్లు అందకపోవడంతో ఎలా బతకాలో అర్థంకాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. పంపిణీ ప్రక్రియలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తా జాగా సంస్కరణలను తెరపైకి తెచ్చారు. కాని లబ్ధిదారుల ఇబ్బందులను ప రిగణలోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలో 2,62,023 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు 1,24,670 మంది, వికలాంగులు 30,909 మంది, వితంతువులు 90,042 మంది, చేనేత కార్మికులు 4,843 మంది, కల్లుగీత కార్మికులు 676 మంది, అభయహస్తం కింద 10,876 మంది లబ్ధిదారులు నెలనెలా పింఛన్ పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు రూ.200, వికలాంగులు, అభయహస్తం లబ్ధిదారులకు రూ.500 చొప్పున పింఛన్ మంజూరవుతోంది. వీరికి ప్రభుత్వం రూ.5 కోట్ల 65 లక్షల మొత్తాన్ని నెలనెలా మంజూరు చేస్తోంది.
 
ఫినో  సంస్థ
 అక్రమాల వల్లే..
 పింఛన్ల పంపిణీ గతంలో ఫినో సంస్థ చేపట్టింది. ఈ సంస్థ చేపట్టిన పింఛన్ల పంపిణీలో చాలా వరకు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తాజాగా ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ విధానం వల్ల అక్రమాలకు చెక్ పెట్టొచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియ జాప్యం జరగడంతో జిల్లాలో దాదాపు 55,917 మందికి పింఛన్లు ఆగిపోయాయి. వచ్చే అరకొర పింఛన్లపై రకరకాల ఆంక్షలు పెట్టడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు పింఛన్ల విడుదలలో జాప్యం జరిగింది. గత రెండు నెలలుగా ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీ కావడం, గవర్నర్‌పాలన కొనసాగడంతో నిధుల విడుదలలో సమస్యలు తలెత్తాయి.
 
 బయోమెట్రిక్‌పై
 అవగాహన ఏదీ?
 గ్రామాల్లో చాలా మందికి బయోమెట్రిక్ పద్ధతిపై అవగాహన లేకపోవడంతో ఈ ప్రక్రియలో వేలాది మంది పాల్గొనలేదు. గ్రామాల్లో ఇంట్రాక్ట్ సంస్థ ద్వారా, మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో మణిపాల్ ఏజెన్సీ ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. జిల్లాలోని 46 మండలాల్లో మొత్తం 33,881 మంది బయోమెట్రిక్ ప్రక్రియలో పాల్గొనలేదు. నెల్లూరు నగరంలో దాదాపు 22,036 మంది అంటే మొత్తం పింఛన్‌దారులు బయోమెట్రిక్ విధానంలో పాల్గొనలేదు. దీంతో వీరికి పింఛన్ల పం పిణీ నిలిచిపోయింది.
 
 4వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్
 జిల్లాలో వేలాది మంది స్మార్ట్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనలేదు. దీనివల్ల పింఛన్లు నిలిచిపోయాయి. గ్రామాల్లో ఇంట్రాక్ట్ సంస్థ, మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో మణిపాల్ ఏజెన్సీ ద్వారా వేలిముద్రలు సేకరణ చేపట్టనున్నాం. ఇందుకోసం నెల్లూరులో 39 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 15లోగా వేలిముద్రల సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాం.
 చంద్రమౌళి, డీఆర్‌డీఏ పీడీ

మరిన్ని వార్తలు