-

టగ్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు సాయం

21 Aug, 2019 07:50 IST|Sakshi
విమానాశ్రయంలో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): నడి సముద్రంలో ఇటీవల జాగ్వార్‌ టగ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం ఆర్థిక సాయం అందజేసింది. ఈ ఘటనలో విశాఖలోని కోటవీధి వాసి కె.భరద్వాజ్‌(23), కోల్‌కతాకు చెందిన అన్వర్‌ ఉల్‌హక్‌(40) మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి కుటుంబ సభ్యులకు పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా చెరో రూ.10 లక్షల చొప్పున చెక్కులను విశాఖ విమానాశ్రయంలో మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. మృతు ల కుటుంబాలకు ఆర్థిక సాయమందించిన యాజమాన్యాన్ని ఆయన అభినందించాడు. అలాగే కంపెనీ ఇన్సూ్యరెన్స్‌ ద్వారా మరో రూ.15.లక్షలు త్వరలోనే అందిస్తామని చెప్పినట్టు మంత్రి తెలిపారు. మృతుని కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం తహశీల్దార్‌ బి.వి.రాణి, ప్రొటోకాల్‌ అధికారి జనార్దన్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు