హుదూద్ జాతీయ విపత్తే

14 Oct, 2014 11:35 IST|Sakshi
హుదూద్ జాతీయ విపత్తే

విజయనగరం : తుపాన్ బాధితులకు కిరోసిన్, బియ్యంతోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు కూడా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజు తెలిపారు. మంగళవారం హుదూద్ తుపాన్ నేపథ్యంలో సంభవించిన నష్టంపై రాష్ట్ర మంత్రి కె. మృణాళిని, జిల్లా అధికారులతో అశోక్గజపతి రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాధమిక అంచనా ప్రకారం జిల్లాలో రూ. 250 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చెప్పారు.

హుదూద్ తుపాన్ జాతీయ విపత్తే అని అశోక్ గజపతి రాజు అన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన 400 మంది ఇంజనీర్ల బృందంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.  హుదూద్ తుపాన్తో విజయనగరం జిల్లాలో ప్రాధమిక అంచనా ప్రకారం రూ. 250 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రి మృణాళిని వెల్లడించారు. నష్టాన్ని ప్రత్యేక బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయని వెల్లడించారు. నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు