48 గంటల్లో వాయుగండం

23 Oct, 2019 03:50 IST|Sakshi

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు 

తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు

వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక 

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాల మీదుగా మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది సాయంత్రం తీవ్ర అల్పపీడనంగా మారింది. మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం  వెల్లడించింది. వాయుగుండంగా మారే క్రమంలో తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.  

పలు జిల్లాల్లో వర్షాలు 
తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మంగళవారం 22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. పలు గ్రామాలు, నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం చిరు జల్లులు కురిశాయి. రొంపిచర్ల మండలంలోని వి.రెడ్డిపాలెంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రకాశం జిల్లా అంతటా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, ఒంగోలులో 7, అమలాపురం, కందుకూరు, అగలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంజినీరింగ్‌ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!

రూ.22 వేలు కడితే.. వారానికి రూ.9 వేలు

దశాబ్దాల కల సాకారం ..అర్చక కుటుంబాల్లో ఆనందం..!

గళమెత్తిన బ్యాంకు ఉద్యోగులు

ప్రైవేట్‌ కాలేజీలపై జగన్‌ సర్కారు కొరడా..! 

రిజిస్ట్రేషన్‌ ఇక ఈజీ

నీరుపమానం

నలభై ఏళ్ల అనుభవం.. నిలువునా నిస్తేజం..!

ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు

ముసుగేసిన ముసురు

‘పచ్చ’పాపం.. రైతు శోకం 

వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష

మన బడి ‘నాడు– నేడు’  కార్యక్రమానికి శ్రీకారం

ఏపీపీఎస్సీ సభ్యుడిగా షేక్‌ సలాంబాబు 

మిడ్‌డే మీల్స్‌ వివాదం.. పీఎస్‌లో పంచాయితీ..!

ఎన్నో ఏళ్ల కల.. సాకారం దిశగా..!

పనులేమీ చేయలేదు.. నిధులు మాత్రం స్వాహా చేశారు..!

శ్రీసిటీలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు

సీఎం రాకతో రిసెప్షన్‌లో సందడి

పాతతరం మందులకు స్వస్తి 

‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు? 

ఆస్పత్రి సొసైటీలకు మార్గదర్శకాలు 

ఒడ్డుకు ‘వశిష్ట’

శతమానం భవతి

కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

బాబు మెదడులో చిప్‌ చెడిపోయింది: గడికోట

నిత్యం 45 వేల టన్నుల ఇసుక సరఫరా

2,252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ఇళ్ల స్థలాలపై కసరత్తు ముమ్మరం

పోటెత్తిన కృష్ణమ్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం