జువారిలో భారీ చోరీ

7 Feb, 2015 01:29 IST|Sakshi

ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి కర్మాగారంలోని కాలనీలో గురువారం రాత్రి ఏకంగా ఏడు ఇళ్లల్లో భారీ చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసిన దొంగలు భారీ మొత్తంలో బంగారు, వెండిని అపహరించారు. కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
 ఎర్రగుంట్ల: మండల పరిధిలోని జువారి కర్మాగారంలోని కాలనీలో గురువారం రాత్రి ఏకంగా ఏడు ఇళ్లల్లో భారీ చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసిన దొంగలు బంగారు, వెండి భారీ మొత్తలంలో అపరించారు. కాలనీలో డీబ్లాక్‌లోని 9/2, 10/2, 5/3, 8/3 గదులలో, ఈ బ్లాక్‌లోని 8/1, 10/2, 13/3 క్వార్టర్సులలోని గదులలో ఈ చోరీలు జరిగాయి. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన చోరీల మాదిరిగానే జువారిలో జరిగిందని పోలీసులు అధికారుల అభిప్రాయ పడుతున్నారు.
 
 లబోదిబోమంటున్న బాధితులు..
 డీబ్లాక్‌లోని 8/3 గదిలో నివాసమంటున్న  గంగాకృష్ణ గురువారం రాత్రి  ప్రొద్దుటూరుకు పోయాడు.శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టబడి ఉంది. ఇంట్లోకి పోయి చూడగా సుమారు 40 తులాల బంగారు పోయిందని వాపోయాడు.  తమ ఇంట్లో సుమారు 45 తులాల బంగారు పోయిందం టూ ఉమామహేశ్వరరెడ్డి లబోదిబోమంటున్నాడు. అలాగే తమ ఇంట్లో రూ.1.50లక్షలు విలువ గల బంగారు పోయిందని ఫణికుమార్  తెలిపాడు.
 
 సెక్యూరిటీల నివాసం వద్ద ఆగిన డాగ్ స్వ్కాడ్..
 చోరీల సంఘటన స్థలం తెలుసుకోవడానికి కడప నుంచి ప్రత్యేక డాన్ అనే డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఈ డాగ్‌ను మొదట లింగారెడ్డి ఇంట్లో జరిగిన స్థలంలోని కొన్ని వస్తువుల వాసన చూసింది. తర్వాత నేరుగా కాలనీలో కొన్ని ప్రాంతాలు తిరిగి కాలనీ చివర ఉన్న సెక్యురిటీల నివాసం వద్దకు పోయి గదిలో ఓ సెక్యురిటీ పడుకోని ఉన్న పరుపును చూసింది.  అనంతరం ఉమామహేశ్వర రెడ్డి ఇంట్లో వస్తువులు వాసన చూసి నేరుగా డీబ్లాక్‌లోని క్వార్టర్స్‌లోనూ చూసింది. రెండోసారి కూడా డాగ్ స్క్వాడ్ సెక్యురిటీ నివాసం వద్దకు పోయి ఆగింది. కాగా భారీ సెక్యురిటీ కలిగిన కాలనీలోని క్వార్టర్స్‌లో  చోరీలు జరగడం ఇదే తొలిసారి.
 పరిశీలించిన డీఎస్పీలు: కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్‌లు, సీఐ పీటీ కేశవరెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డిలు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును సీఐను అడిగి తెలుసుకున్నారు.
 
  ఇంటి తలుపులును ఏవిధంగా పగులగొట్టారో పరిశీలించారు. ప్రొద్దుటూరులో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగింది డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అన్నారు.  ఇది అనుభవం గల దొంగల పని అని అన్నారు. అన్ని కోణాలలో పరిశీలిస్తామని చెప్పారు. చోరీల జరిగిన సమీపంలోని బయట గడ్డి పొదలలో ఒక డైరీ కన్పించింది. దీనిని కూడా పరిశీలించారు. తర్వాత కడప నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి 7 ఇళ్లల్లో వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సంజీవరెడ్డి అన్నారు.
 
 80 తులాలు బంగారు, రెండు కిలోల వెండి అపహరణ
 ఎర్రగుంట్ల: జువారి కాలనీలో ఏడు ఇండ్లల్లో జరిగిన చోరీలో సుమారు 80 తులాల బంగారుతో పాటు 2 కిలోల వెండి అభరణాలు పోయినట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు. ఎలాంటి నగదు పోలేదని అన్నారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు