డ్వాక్రాలకు ఇసుక ర్యాంపులు హుళక్కే?

14 Sep, 2014 01:11 IST|Sakshi
డ్వాక్రాలకు ఇసుక ర్యాంపులు హుళక్కే?
  • అనకాపల్లి సర్కిల్ నదుల్లో అధికారుల పరిశీలన
  • శారద, తాండవ పరిధిలో అధికారిక రీచ్‌లు లేనట్టే
  • వరహా నదిలో మూడింటి అనుమతికి అవకాశం
  • తుది నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే
  • అనకాపల్లి : ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అనకాపల్లి సర్కిల్ పరిధిలో అధికారికంగా వాటిని నిర్వహించే వీలు లేకుండాపోతోంది. అనకాపల్లి సర్కిల్ భూగర్భ గనుల శాఖ పరిధిలో ఏ ఏ చోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించవచ్చో తెలుసుకొనేందుకు వివిధ శాఖల అధికారులు చేపట్టిన సంయుక్త సర్వేలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

    అనకాపల్లి సర్కిల్‌లోని జాజిగెడ్డ- 1, 2, కల్యాణపులోవ, తాండవ రిజర్వాయర్ పరిధిలో స్వయం సహా యక గ్రూపులు రీచ్‌లు నిర్వహించేం దుకు సరిపడా ఇసుక లేదని అధికారులు కొద్దిరోజుల క్రితం తేల్చారు. తాజాగా నదుల్లో ఇసుక రీచ్ లు ఏ ఏ చోట్ల నిర్వహించవచ్చో అంచనా వేసేం దుకు భూగర్భ గనుల శాఖ, నీటి పారుదల శాఖ, భూగర్భ జల వనరుల శాఖకు చెందిన బృందాలు ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ శారదా, వరహా, తాండవ, సర్ప నదు ల్లో సర్వే చేపట్టాయి.

    39 ప్రాంతాల్లో ఇసుక తవ్వకానికి గల అవకాశాలు, సాంకేతిక అవరోధాలను పరిశీలించాయి. వాల్టా చట్టం అవరోధంగా మారడంతో ఒక్క వరహా నదీ పరివాహక ప్రాంతంలో మాత్రమే మూడుచోట్ల ఇసుక రీచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సర్వేలో గుర్తిం చాయి. అయితే సర్వే బృందం సమర్పించిన నివేదిక పరిశీలించి నిర్ణయం తీసుకునేది కలెక్టర్ కావడంతో ఎన్ని రీచ్‌లకు అనుమతి లభిస్తుందనేది ఉత్కంఠగా ఉంది. 21 మండలాలతో విశాలంగా ఉండే అన కాపల్లి సర్కిల్ పరిధిలో ఇసుక రీచ్‌ల నిర్వహణకు అవకాశాలు లేకపోవడం డ్వాక్రా గ్రూపులకు నిరాశ కల్గించినట్టే.
     
    అక్రమార్కులపై చర్యలు శూన్యం

    అనధికారికంగా ఇసుక ర్యాంప్‌లు  నిర్వహిస్తున్న వారిని అధికార  యంత్రాంగం ఏమీ చేయలేకపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోవాల్సింది మండల స్థాయి అధికారులని చెప్పి తప్పించుకుం టున్నారు.
     

మరిన్ని వార్తలు