చేయి చేయి కలిపి.. హోదా కోసం నిలిచి..

20 Mar, 2018 01:47 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: పిల్లాజెల్లా.. ఊరూవాడా.. అందరూ రోడ్లపైకి చేరారు.. చేయీ చేయీ కలిపారు.. ఎర్రటి ఎండ చురుక్కుమంటున్నా... నిలబడడం వల్ల నీరసం వస్తున్నా మొక్కవోని దీక్షతో అలాగే నిలిచారు.. నినాదాలతో హోరెత్తించారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా..రాష్ట్రవ్యాపితంగా ‘ప్రజాసంకల్ప మానవహారం’ కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటులో పోరాడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు సంఘీభావంగా ఆ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ‘ప్రజాసంకల్ప మానవహారం’ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. పలు చోట్ల ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి ఈ మానవహారం కార్యక్రమాలను జయప్రదం చేశారు.  వివిధ నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన మానవహారాలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

విశాఖలో...

కొమ్మూరు మానవహారంలో ప్రతిపక్షనేత..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో గ్రామస్తులు, పార్టీ అభిమానులతో కలిసి ప్రజాసంకల్ప మానవహారంలో పాల్గొన్నారు.  జగన్‌ పాదయాత్రగా కొమ్మూరు చేరుకొనే సమయానికి గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి మానవహారంగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చితీరాలంటూ నినాదాలు చేస్తున్నారు. పార్టీ నేతలు రావి వెంకటరమణ, మేకతోటి సుచరిత, లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి తదితరులతో కలిసి జగన్‌మోహన్‌రెడ్డి ఆ  మానవహారంలో పాల్గొన్నారు.  ‘ప్రత్యేక హోదా జగన్‌తోనే సాధ్యం’.. ఢిల్లీ గడ్డపై హోదా నినాదం వినిపించిన ఏకైక నాయకుడు జగన్‌’ అని ప్రజలు, అభిమానులు నినాదాలు చేశారు. 

అనంతపురంలో...

మరిన్ని వార్తలు